ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి
దిశ, స్పోర్ట్స్: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు యోనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ 750 సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీస్‌లోనే ఇంటి దారి పట్టింది. శనివారం పారిస్‌లో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 15 క్రీడాకారిణి సయాక టకహాషిపై 21-18, 16-21, 12-21 తేడాతో ఓడిపోయింది. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనపడిన పీసీ సింధు.. ఆ తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. తన కెరీర్‌లో టకహాషితో 8 సార్లు తలపడిన […]
దిశ, స్పోర్ట్స్: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు యోనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ 750 సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీస్‌లోనే ఇంటి దారి పట్టింది. శనివారం పారిస్‌లో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 15 క్రీడాకారిణి సయాక టకహాషిపై 21-18, 16-21, 12-21 తేడాతో ఓడిపోయింది. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనపడిన పీసీ సింధు.. ఆ తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. తన కెరీర్‌లో టకహాషితో 8 సార్లు తలపడిన పీసీ సింధు నాలుగు సార్లు ఓడిపోయింది.
మొదట్లో పీవీ సింధు ఆధిక్యత ప్రదర్శించింది. కానీ సింధు బ్యాక్ హాండ్ బలహీనత తెలిసన టకహాషి పదే పదే స్మాష్‌లు కొడుతూ ఆధిపత్యం చూపించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచిన తర్వాత పీవీ సింధుకు వరుసగా ఇది రెండో ఓటమి. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ అయిన పీవీ సింధు గత వారంలో డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో కూడా ఓడింది. పీవీ సింధు ఓటమితో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అందరూ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనని ప్రేక్షకులు భావిస్తున్నారు.