తెలుగు కీర్తి దశ, దిశలకు చాటిన సినారె

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ముద్దు బిడ్డగా తెలుగు తల్లి ఘన కీర్తిని దశ, దిశలకు చాటి చెప్పిన ఘనత డాక్టర్ సీ నారాయణ రెడ్డిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఈ మేరకు బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాల్‌లో ‘సినారె సాహితీ వైజయంతి’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిరాజుగా, రాజు కవిగా సాహిత్య జీవనంలోనూ, యధార్ధ జీవితంలోనూ రాణించిన మహనీయులు సినారే అని కొనియాడారు. ఆయన జీవిత […]

Update: 2020-07-31 07:10 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ముద్దు బిడ్డగా తెలుగు తల్లి ఘన కీర్తిని దశ, దిశలకు చాటి చెప్పిన ఘనత డాక్టర్ సీ నారాయణ రెడ్డిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఈ మేరకు బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాల్‌లో ‘సినారె సాహితీ వైజయంతి’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిరాజుగా, రాజు కవిగా సాహిత్య జీవనంలోనూ, యధార్ధ జీవితంలోనూ రాణించిన మహనీయులు సినారే అని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను భావి తరాలకు అందచేసేందుకు ముందుకు వచ్చిన భావ సారూప్య సంస్థలను రమణాచారి అభినందించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన సర్వార్ధ సంక్షేమ సమితి పీవీ మనోహరరావు మాట్లాడుతూ.. సాహిత్య ప్రపంచానికి
రారాజు వంటి వారు సినారె అని, ఆయన చేపట్టిన పనులకే వన్నె తెచ్చిన ముద్దు బిడ్డ అన్నారు.

Tags:    

Similar News