రికార్డు స్థాయిలో బుకింగ్స్ సాధించిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర విభాగంలో సంచలనంగా మారిన కంపెనీలుగా ఓలా, సింపుల్ ఎనర్జీలు నిలిచాయి. ఈ రెండు కంపెనీలు ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి తమ స్కూటర్లను తీసుకొచ్చాయి. ఈ కంపెనీల నుంచి వచ్చిన వాహనాలపై కొనుగోలుదారులు విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 24 గంటల్లో లక్ష బుకింగ్‌లను సాధించింది. ఇక, సింపుల్ ఎనర్జీ కంపెనీ సైతం తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ […]

Update: 2021-08-20 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర విభాగంలో సంచలనంగా మారిన కంపెనీలుగా ఓలా, సింపుల్ ఎనర్జీలు నిలిచాయి. ఈ రెండు కంపెనీలు ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి తమ స్కూటర్లను తీసుకొచ్చాయి. ఈ కంపెనీల నుంచి వచ్చిన వాహనాలపై కొనుగోలుదారులు విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 24 గంటల్లో లక్ష బుకింగ్‌లను సాధించింది. ఇక, సింపుల్ ఎనర్జీ కంపెనీ సైతం తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రికార్డు స్థాయిలోనే బుకింగ్‌లను సాధించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం ఏకంగా 30,000 ప్రీ బుకింగ్స్ వచ్చాయని వెల్లడించింది. మార్కెటింగ్ వ్యూహం లేకుండా వచ్చినప్పటికీ కొనుగోలుదారుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ లభించడం సంతోషంగా ఉందని కంపెనీ వివరించింది.

ఇటీవల వినియోగదారులు ఈ స్కూటర్ కోసం బుకింగ్ చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్య వచ్చినట్టు తెలిపింది. ఒకే సమయంలో ఎక్కువమంది ఆర్డర్ చేయడం వల్ల ఇలా జరిగిందని, దీన్ని పరిష్కరించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ వీలైనన్ని ఎక్కువ స్కూటర్లను డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఉందని అభిప్రాయపడింది. ‘బుకింగ్ చేసిన వారికి సాధ్యమైనంత త్వరగా స్కూటర్లను డెలివరీ చేస్తామనే నమ్మకం ఉందని, స్థానిక కంపెనీకి ఈ స్థాయిలో మద్దతు ఇచ్చినందుకు కస్టమర్లకు కృతజ్ఞతలు చెబుతున్నామని’ సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. కాగా, సింపుల్ వన్ స్కూటర్ బుకింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే రూ. 1,947 చెల్లించి చేసుకోవచ్చని వెల్లడించింది.

Tags:    

Similar News