మూడ్ బాగా లేదా? ఇలా ట్రై చేయండి!
దిశ, వెబ్‌డెస్క్: ‘డే టు డే లైఫ్’లో నిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనం వాటన్నింటితో వీరోచితంగా పోరాడుతూ అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అప్పుడప్పుడు నెగెటివిటీ కూడా మనల్ని చుట్టుముడుతుంది. అలాంటప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది. చాలా డిస్టర్బ్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. ఇలాంటి సమయాల్లో కొన్ని సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే.. బెటర్ ఫీలింగ్ కలగడమే కాక, మన మూడ్ కూడా అప్‌లిఫ్ట్ అవుతుంది. అవేంటో చూద్దాం.. ఫేవరెట్స్: […]
దిశ, వెబ్‌డెస్క్: ‘డే టు డే లైఫ్’లో నిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనం వాటన్నింటితో వీరోచితంగా పోరాడుతూ అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అప్పుడప్పుడు నెగెటివిటీ కూడా మనల్ని చుట్టుముడుతుంది. అలాంటప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది. చాలా డిస్టర్బ్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. ఇలాంటి సమయాల్లో కొన్ని సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే.. బెటర్ ఫీలింగ్ కలగడమే కాక, మన మూడ్ కూడా అప్‌లిఫ్ట్ అవుతుంది. అవేంటో చూద్దాం..
ఫేవరెట్స్:
సెల్ఫ్ కేర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మన మనసుకు ఏదీ నచ్చుతుందో అదే చేయాలి. మూడ్ బాగా లేకున్నా.. లోన్లీగా ఫీల్ అయినా సరే.. మన ఫేవ్‌రెట్ మూవీ లేదా ఫేవ్‌రెట్ ‘షో’ చూడాలి. అప్పుడు మనసు కొద్దిగా కుదుటపడుతుంది. ఇన్‌స్టంట్‌గా రిలాక్సేషన్ పొందుతాం. అందుకే అప్పుడప్పుడు నచ్చిన పని చేయడం, కొత్త ప్రదేశానికి వెళ్లడం లేదా పిక్నిక్, టూర్.. ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవడం ద్వారా బిజీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలి. అప్పటివరకూ ఉన్న చికాకులు, బాధలు అన్నింటినీ పక్కనపెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇష్టమైన పాటలు వినడం, సంగీతాన్ని ఆస్వాదించడం కూడా బ్యాడ్ మూడ్‌ను రిఫ్రెష్ చేసేందుకు తోడ్పడతాయి.
కుకింగ్ థెరపీ:
బోరింగ్ అనిపించినా.. మూడ్ బాగా లేకున్నా.. కుకింగ్ ట్రై చేస్తే ఇట్టే రిఫ్రెష్ కావచ్చు. కుకింగ్ ఓ థెరపీలా పనిచేస్తుందని నిపుణులు కూడా చెప్తున్నారు. ‘బౌల్ ఆఫ్ పేవరేట్ సూప్, ప్లేట్ ఆఫ్ పాస్తా.. హాఫ్ బాయిల్’ ఏదో ఒకటి ట్రై చేయడం బెటర్. అదే మీరు స్వతహాగానే మంచి కుక్ అయితే మాత్రం ఇంటిల్లిపాదికి మంచి ఫుడ్‌ను రెడీ చేసి వాళ్ల కాంప్లిమెంట్స్‌ను అందుకోవచ్చు. అలా ప్రేమను పంచుకుంటూ.. మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవచ్చు.
వర్చువల్ కనెక్షన్:
లాక్‌డౌన్ వల్ల వర్చువల్ కనెక్షన్ చాలా పెరిగింది. ఇది పక్కన పెడితే.. ఇంటికి, స్నేహితులకు, ఆత్మీయులకు, ఇష్టమైన వారికి.. ఇలా ఎవరికి దూరంగా ఉన్నా సరే.. ఒక్క వీడియో కాల్ లేదా ఫోన్ కాల్.. బ్యాడ్ మూడ్‌ను చుట్టచుట్టేసి ఆ టైమ్‌ను ఫీల్‌గుడ్‌గా మార్చేస్తుంది.
ఇవి కూడా:
సోషల్ మీడియాకు దూరంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోవడం, ఫేవరెట్ డ్రెస్ వేసుకోవడం, ఇల్లంతా క్లీన్‌గా ఉంచుకోవడం, పర్సనల్ స్పేస్‌ను మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవడం. ఇవేగాక చెట్లను, ప్రకృతిని ఆస్వాదించడం, కవితలు రాయడం, పెయింటింగ్స్ వేయడం, గేమ్స్ ఆడటం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నెన్నో పనులు మన ఫీలింగ్స్‌ను, మూడ్‌ను ఆన్ ది స్పాట్ మార్చేస్తాయి.