ఇంటర్నెట్ లేదు.. కానీ చదివించాలి ఎలా?
దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఎత్తైన కొండల మీద నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు. వారికి మాట్లాడుకోవడానికి సెల్‌ఫోన్ సిగ్నల్ దొరకడమే అతి కష్టం. ఇక ఆన్‌లైన్ క్లాసుల సంగతి దేవుడెరుగు. కానీ కొవిడ్ 19 మహమ్మారి కారణంగా పిల్లల చదువులకు ఆన్‌లైన్ క్లాసులు తప్ప మరో మార్గం లేదు. దీంతో క్లాసులు లేవు కదా అని టీచర్లు ఇంట్లో ఎంజాయ్ చేయడం లేదు. వారికి కూడా ఉపాధి అవసరమే. ఉపాధి కంటే ముఖ్యంగా తమ […]
దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఎత్తైన కొండల మీద నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు. వారికి మాట్లాడుకోవడానికి సెల్‌ఫోన్ సిగ్నల్ దొరకడమే అతి కష్టం. ఇక ఆన్‌లైన్ క్లాసుల సంగతి దేవుడెరుగు. కానీ కొవిడ్ 19 మహమ్మారి కారణంగా పిల్లల చదువులకు ఆన్‌లైన్ క్లాసులు తప్ప మరో మార్గం లేదు. దీంతో క్లాసులు లేవు కదా అని టీచర్లు ఇంట్లో ఎంజాయ్ చేయడం లేదు. వారికి కూడా ఉపాధి అవసరమే. ఉపాధి కంటే ముఖ్యంగా తమ విద్యార్థుల చదువు ఏమైపోతుందోనని బాధపడే టీచర్లు కూడా చాలా మంది ఉంటారు. కానీ వారు మాత్రం ఏం చేయగలరు? కానీ సిక్కింలోని దక్షిణ సిక్కిం జిల్లాకు చెందిన ఇంద్ర ముఖి ఛేత్రి మాత్రం అలా ఏం చేయలేనని ఊరికే కూర్చోలేదు. తన వంతుగా కష్టపడింది. ఇంతకీ ముఖి ఛేత్రి ఏం చేసింది?
సిక్కింలోని మారుమూల గ్రామం రవాంగ్లాలో చాలా వరకు రైతు కుటుంబాలే. అక్కడి వీసీజీఎల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఛేత్రి.. మ్యాథ్స్, సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ సదుపాయం లేని పిల్లల గురించి ఆమె రోజూ ఆలోచించేది. ఇక ఒక రోజు తను చేయాలనుకున్న పని మొదలుపెట్టింది. పొద్దున్నే 9 గం.లకు గ్రామానికి బయల్దేరింది. ఇక ప్రతి ఇంటికీ వెళ్తూ తన విద్యార్థులకు వ్యక్తిగతంగా పాఠాలు చెప్పింది. అలా ఒకరోజులో వీలైనంత మంది ఇంటికి వెళ్లి వారికి రెండు రోజులకు సరిపడా హోంవర్క్ ఇచ్చి, ఆ రెండు రోజుల్లో వేరే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి విద్యాశాఖ అధికారులు ఛేత్రి చేస్తున్న పనిని ప్రభుత్వ టీచర్లందరూ వీలైనంత మేరకు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విధానానికి ఒక కరికులమ్ కూడా విడుదలచేసి, నిర్మాణాత్మకంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.