డేటింగ్‌‌లో అలా.. దీపికపై కాన్సంట్రేట్ చేస్తున్న ఎక్స్‌-బాయ్‌ఫ్రెండ్

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునెపై పొగడ్తల వర్షం కురిపించాడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మాల్యా. త్వరలో తన మెమొయిర్ రిలీజ్ చేయబోతున్న సిద్ధార్థ్.. ఓ ఇంటర్వ్యూలో మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ గురించి వివరించాడు. ఈ క్రమంలోనే ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌’ ద్వారా దీపిక మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే విధానాన్ని అప్రిషియేట్ చేశాడు. తాము డేటింగ్‌లో ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ గురించి ఎప్పుడూ డిస్కస్ చేయలేదన్న సిద్ధార్థ్.. 2015-16 మధ్యలో ఈ […]

Update: 2021-10-07 01:38 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునెపై పొగడ్తల వర్షం కురిపించాడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మాల్యా. త్వరలో తన మెమొయిర్ రిలీజ్ చేయబోతున్న సిద్ధార్థ్.. ఓ ఇంటర్వ్యూలో మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ గురించి వివరించాడు. ఈ క్రమంలోనే ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌’ ద్వారా దీపిక మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే విధానాన్ని అప్రిషియేట్ చేశాడు. తాము డేటింగ్‌లో ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ గురించి ఎప్పుడూ డిస్కస్ చేయలేదన్న సిద్ధార్థ్.. 2015-16 మధ్యలో ఈ ప్రాబ్లమ్‌తో చాలా సఫర్ అయ్యానని తెలిపాడు. పుస్తకంలో చెప్పినట్లుగా తనకు చాలా విషయాల గురించి తెలియదని, దీనిపై ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పాడు. అందుకే దీపిక చేస్తున్న పని ఇన్‌స్పైరింగ్‌గా ఉందన్న ఆయన,.. ఇండియాలో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడే వారు ఎక్కువగా లేరని అభిప్రాయపడ్డాడు. దీపిక లాంటి వారు తమ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ విషయంపై డిస్కస్ చేయడం గొప్ప విషయమని, తద్వారా స్కూల్‌లో టీచర్స్ పిల్లలకు ఈ విషయం గురించి బోధిస్తారని, ఫ్యామిలీస్ కూడా చర్చించడం మొదలుపెడతాయని అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News