15 రోజుల్లోనే పనిపూర్తవ్వాలి.. సిద్దిపేట కలెక్టర్ కీలక ఆదేశాలు

దిశ ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఖాళీగా ఉన్న 74 రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయనున్నారని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రేషన్ డీలర్ల రిక్రూట్మెంట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు, ఎంపిక, నియామక, విధి విధానాలను ఇప్పటికే జిల్లాలోని అందరూ […]

Update: 2021-07-19 07:48 GMT

దిశ ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఖాళీగా ఉన్న 74 రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయనున్నారని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.

రేషన్ డీలర్ల రిక్రూట్మెంట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు, ఎంపిక, నియామక, విధి విధానాలను ఇప్పటికే జిల్లాలోని అందరూ ఆర్డీవోలకు పంపించామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా రేషన్ డీలర్ల భర్తీ చేపట్టాలని ఆర్డీఓలకు ఇప్పటికే విస్పష్ట ఆదేశాలు ఇచ్చామన్నారు. వారం రోజుల్లో హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. వచ్చే పదిహేను రోజుల్లో జిల్లాలో ఖాళీగా ఉన్న 74 రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News