వివాదంలో సిద్దిపేట కలెక్టర్.. ముచ్చటగా మూడోసారి

దిశ ప్రతినిధి, మెదక్ : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంలో సిద్దిపేట కలెక్టర్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు. వారం రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. శనివారం మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అయితే కొవిడ్ […]

Update: 2021-06-26 06:18 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంలో సిద్దిపేట కలెక్టర్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు. వారం రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. శనివారం మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలనే ఆదేశాలున్నాయి. సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించారు.. ఒక్క సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తప్పా. దీనిపై మరోమారు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం కూడా సీఎం సిద్దిపేట పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణలో సైతం మాస్క్ ఆయన ధరించలేదు.

ఆ తర్వాత రోజు మంత్రి హరీశ్ రావుతో కలిసి పర్యటించిన సందర్భంలోనూ మాస్క్ ధరించక పోవడాన్ని ‘దిశ’ మాస్క్ ధరించని కలెక్టర్ అంటూ.. కథనాన్ని ప్రచురించింది. విషయం తెలుసుకున్న కలెక్టర్.. వెంటనే మాస్క్ ధరించారు. తిరిగి మళ్ళీ సీఎం సమావేశంలో మాస్క్ ధరించకపోవడం గమనార్హం. కలెక్టర్ మాస్క్ ధరించకపోవడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట కలెక్టర్ తనకు కరోనా సోకదు అనుకుంటున్నారా.. తనకేమీ కాదనే భరోసానా లేక తనను అడిగేవారు లేరనుకుంటున్నారా..?. సీఎం, సీఎస్ అంటే లెక్కలేదా.. సీఎంను మించిన కలెక్టరా.? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ఆయన ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి.

 

Tags:    

Similar News