గొర్రెలకు ఫైన్ వేసిన అధికారులు.. ఎందుకంటే?
దిశ సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను గొర్రెలు మేసినందుకు (జీవాల) యజమాని కి జరిమానా విధించిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోనీ ఏడవ వార్డు లో చోటుచేసుకుంది. పట్టణ హరితహారం అధికారి సామల ఐలయ్య తెలిపిన కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జైన రమేష్ గొర్రెలు సిద్దిపేట పట్టణంలో హరిత హారంలో నాటిన మొక్కలను మేయగా ఈ విషయాన్ని7 వ వార్డు స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డి హరితహారం అధికారి ఐలయ్య […]
దిశ సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను గొర్రెలు మేసినందుకు (జీవాల) యజమాని కి జరిమానా విధించిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోనీ ఏడవ వార్డు లో చోటుచేసుకుంది. పట్టణ హరితహారం అధికారి సామల ఐలయ్య తెలిపిన కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జైన రమేష్ గొర్రెలు సిద్దిపేట పట్టణంలో హరిత హారంలో నాటిన మొక్కలను మేయగా ఈ విషయాన్ని7 వ వార్డు స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డి హరితహారం అధికారి ఐలయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఐలయ్య గొర్రెలు మేసిన మొక్కలను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ దృష్టికితీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు గొర్ల కాపార్ల యజమాని జైన రమేష్ కు వెయ్యి రూపాయల జరిమాన విధించారు. ఈ సందర్బంగా ఐలయ్య మాట్లాడుతూ హరితహారం లో భాగంగా నాటిన మొక్కలను నష్ట పరిస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.