టోకెన్ల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

దిశ, మెదక్: టోకెన్ల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిబ్బందికి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ ఆదేశించారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శుక్రవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ, ఐకేపీ, పీఏసీఎస్‍, మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు […]

Update: 2020-04-17 04:28 GMT

దిశ, మెదక్: టోకెన్ల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిబ్బందికి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ ఆదేశించారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శుక్రవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ, ఐకేపీ, పీఏసీఎస్‍, మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులు తగిన పత్రాలు ఇస్తే వారం రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు.

Tags: Siddipet,Additional collector,Launch, Rice Grain Purchase Center

Tags:    

Similar News