చిన్న, మధ్య తరహా సంస్థలకు అత్యవసర రుణాలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎమ్ఈ)కు అత్యవసరంగా రూ. కోటి వరకూ రుణాలివ్వనున్నట్టు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ) వెల్లడించింది. ఎటువంటి తాకట్టు లేకుండా ఎస్ఐడీబీఐ ఈ రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారికి రెండు రోజుల్లోగా రుణ మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేసింది. వడ్డీరేటుని కూడా కేవలం 5 శాతమే నిర్ణయించినట్టు, సూక్ష్మ, చిన్న మధ్య తర్వా సంస్థలకు రుణ సదుపాయాన్ని రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎమ్ఈ)కు అత్యవసరంగా రూ. కోటి వరకూ రుణాలివ్వనున్నట్టు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ) వెల్లడించింది. ఎటువంటి తాకట్టు లేకుండా ఎస్ఐడీబీఐ ఈ రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారికి రెండు రోజుల్లోగా రుణ మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేసింది. వడ్డీరేటుని కూడా కేవలం 5 శాతమే నిర్ణయించినట్టు, సూక్ష్మ, చిన్న మధ్య తర్వా సంస్థలకు రుణ సదుపాయాన్ని రూ. 2 కోట్ల వరకూ పెంచుతున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి అవుతున్న కోవిడ్-19ని నివారించేందుకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు వంటి ఇంకా ఇతర రక్షణ వస్తువుల తయారీ కోసం ఈ రుణాలను ఇస్తున్నట్టు ఎస్ఐడీబీఐ తెలిపింది.
Tags: emergency working capital, Coronavirus, Economy, India, SIDBI