ఓవర్ యాక్షన్…ఇళ్లలోకి జోరబడి కొట్టిన ఎస్సై

నెల్లూరు జిల్లా‌లో ఒక ఎస్సై చేసిన ఓవర్ యాక్షన్.. ఉన్నతాధికారులకు అగ్రహం కల్పించింది. దాని వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాదులో చిక్కుకుపోయిన పలువురు నెల్లూరు జిల్లా జలదంకి వాసులు, ఎలాగోలా శ్రమించి స్వగ్రామాలకు చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ, వారి ఇళ్లలోకి జొరబడి, ఎందుకు వచ్చారని తిడుతూ, విపరీతంగా కొట్టాడు. ఎస్సై దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ గ్రామస్థులు నిరసనకి దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. […]

Update: 2020-04-28 02:56 GMT

నెల్లూరు జిల్లా‌లో ఒక ఎస్సై చేసిన ఓవర్ యాక్షన్.. ఉన్నతాధికారులకు అగ్రహం కల్పించింది. దాని వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాదులో చిక్కుకుపోయిన పలువురు నెల్లూరు జిల్లా జలదంకి వాసులు, ఎలాగోలా శ్రమించి స్వగ్రామాలకు చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ, వారి ఇళ్లలోకి జొరబడి, ఎందుకు వచ్చారని తిడుతూ, విపరీతంగా కొట్టాడు.

ఎస్సై దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ గ్రామస్థులు నిరసనకి దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. నెల్లూరులో కరోనా కేసులు భయపెడుతున్న నేపథ్యంలో తానలా ప్రవర్తించానని వారికి ఎస్సై వివరణ ఇవ్వగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు, బాధితులకు ఆయనతో క్షమాపణలు చెప్పించి, వివాదాన్ని రాజీ చేశారు.

Tags: nellore district, si attack on villagers, si overaction, jaladanki, ap, si said sorry

Tags:    

Similar News