అనాథ పిల్లలకు ఎస్ఐ ఆర్థిక సాయం..!
దిశ, తుంగతుర్తి: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు స్థానిక ఎస్ఐ ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శారద, సోమయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వీరి పిల్లలు సతీష్, నాగలక్ష్మి అనాధలుగా మారారు. పిల్లలను వారి అమ్మమ్మ, తాతయ్యలే చేరదీశారు. ఆ వృద్ధ దంపతులు పేదవారు. దీనికి తోడు అమ్మమ్మకు కళ్లు కనిపించవు. తాతయ్యకు కాలు విరగడంతో మంచంలో పడ్డాడు. వీరికి […]
దిశ, తుంగతుర్తి: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు స్థానిక ఎస్ఐ ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శారద, సోమయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వీరి పిల్లలు సతీష్, నాగలక్ష్మి అనాధలుగా మారారు. పిల్లలను వారి అమ్మమ్మ, తాతయ్యలే చేరదీశారు.
ఆ వృద్ధ దంపతులు పేదవారు. దీనికి తోడు అమ్మమ్మకు కళ్లు కనిపించవు. తాతయ్యకు కాలు విరగడంతో మంచంలో పడ్డాడు. వీరికి రేషన్ కార్డు కూడా లేకపోవడంతో తినడానికి బియ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వీరి పరిస్థితిని చూసి చలించి పోయిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.