పోలీస్‌శాఖలో కరోనా కల్లోలం.. ఎస్‌ఐ గణపతి మృతి

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌‌లో ఉన్న ఎస్సై గణపతి మృతిచెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వివరాళ్లోకి వెళితే.. గత ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దేవునిపల్లి ఏఎస్సైగా పని చేసిన గణపతి […]

Update: 2021-04-26 23:25 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌‌లో ఉన్న ఎస్సై గణపతి మృతిచెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వివరాళ్లోకి వెళితే.. గత ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దేవునిపల్లి ఏఎస్సైగా పని చేసిన గణపతి గత ఆరు నెలల క్రితం ఎస్సైగా ప్రమోషన్ రావడంతో సిద్దిపేటకు బదిలీపై వెళ్లి తిరిగి కామారెడ్డి ఎస్పీ కార్యాలయం వీఆర్‌లోకి వచ్చారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో కరోనా సోకి అనేకమంది పోలీసులు మృతిచెందారు. రోజూ వందలమంది పోలీసులు మహమ్మారి బారినపడుతున్నారు.

Tags:    

Similar News