ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్..
దిశ, ముషీరాబాద్: లంచం డిమాండ్ చేసిన కేసులో ఎస్సై, అతనికి సహకరించినందుకు కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ కథనం ప్రకారం.. గాంధీనగర్ పీఎస్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ.. ఫోర్జరీ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులను గతనెలలో రిమాండ్‌కు పంపించారు. కాగా, ఇటీవల వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో ప్రతి శనివారం, బుధవారం పీఎస్‌కు వచ్చి […]
దిశ, ముషీరాబాద్: లంచం డిమాండ్ చేసిన కేసులో ఎస్సై, అతనికి సహకరించినందుకు కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ కథనం ప్రకారం.. గాంధీనగర్ పీఎస్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ.. ఫోర్జరీ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులను గతనెలలో రిమాండ్‌కు పంపించారు. కాగా, ఇటీవల వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో ప్రతి శనివారం, బుధవారం పీఎస్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలి. ఈ క్రమంలోనే నిందితులను మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతానని.. అలా వద్దనుకుంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
సదరు వ్యక్తి ఏం చేయాలో తోచక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అసలు విషయం మొత్తం చెప్పి ఎస్ఐ లక్ష్మీనారాయణకు రూ. 30 వేలు ఇస్తానని అంగీకరించినట్లు బాధితుడు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం హధ్యాహ్నం 12 గంటలకు సదరు వ్యక్తి ఎస్ఐ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి రూ.30వేలు తీసుకోవాలని చెప్పాడు. ఎస్ఐ తన వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేష్‌కు ఇచ్చి పంపించాలని అతనికి చెప్పాడు. అయితే, రూ.30వేలు తీసుకుంటున్న క్రమంలో కానిస్టేబుల్ నరేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్ఐ లక్ష్మీనారాయణ చెప్పినందుకే తాను రూ.30 వేలు తీసుకున్నట్లు కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు వివరించాడు.దీంతో ఎస్ఐ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ నరేష్ లను ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనే విచారించారు. అనంతరం వారి నుంచి రూ.30 వేలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.