నటిని హింసించిన భర్త.. సీసీటీవీ ఫుటేజీ వైరల్

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ శ్వేతా తివారి తన మాజీ భర్త అభినవ్ కోహ్లీకి మధ్య వివాదం నడుస్తోంది. గృహహింస కింద కేసు పెడతానని శ్వేత ఈ మధ్య హెచ్చరించగా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పాడు అభినవ్. అయితే తాను నిందలు వేయడం లేదని, అసలు నిజమేంటో అందరూ చూడండి అంటూ తనను, తన కొడుకును హింసిస్తున్న సీసీటీవీ ఫుటేజీ రిలీజ్ చేసింది. ఓ వీడియోలో తన నుంచి అభినవ్ బాబు(రేయాన్ష్)ను బలవంతంగా లాక్కోవడం […]

Update: 2021-05-11 08:04 GMT

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ శ్వేతా తివారి తన మాజీ భర్త అభినవ్ కోహ్లీకి మధ్య వివాదం నడుస్తోంది. గృహహింస కింద కేసు పెడతానని శ్వేత ఈ మధ్య హెచ్చరించగా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పాడు అభినవ్. అయితే తాను నిందలు వేయడం లేదని, అసలు నిజమేంటో అందరూ చూడండి అంటూ తనను, తన కొడుకును హింసిస్తున్న సీసీటీవీ ఫుటేజీ రిలీజ్ చేసింది.

ఓ వీడియోలో తన నుంచి అభినవ్ బాబు(రేయాన్ష్)ను బలవంతంగా లాక్కోవడం కనిపిస్తుండగా.. మరో వీడియోలో అభినవ్‌కు భయపడి రేయాన్ష్ దాచుకునేందుకు ప్రయత్నించడం కనపడింది. ఇది ఫిజికల్ అబ్యూజ్ కాకపోతే మరేంటని ప్రశ్నించిన తివారీ.. నిజాలు ప్రపంచానికి చూపెట్టేందుకే ఈ వీడియో షేర్ చేశానని చెప్పింది. ఈ ఘటన తర్వాత దాదాపు నెలరోజుల పాటు తన కొడుకు నిద్రకూడా పోలేదని, ఇప్పటికీ తన తండ్రి అంటే భయపడుతున్నాడని తెలిపింది. అయితే తన బాబు మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేదని.. ప్రశాంతంగా, సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించింది. కాగా ఈ వీడియో చూసిన తోటి నటీనటులు తనకు సపోర్ట్ చేయగా.. నిర్మాత ఏక్తా కపూర్ అభినవ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

 

Tags:    

Similar News