నన్నెందుకు స్లెడ్జ్ చేశాడో తెలియదు: శుభ్‌మన్
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తనకు హార్ధిక్ పాండ్యాకు మధ్య దేశవాళీ క్రికెట్‌లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వివరించాడు. పాండ్యా తనను ఒకసారి స్లెడ్జింగ్ చేశాడని చెప్పాడు. ‘నేను రంజీ సీజన్ ఆడే సమయంలో ఒకసారి బరోడాతో వన్డే మ్యాచ్ ఆడాం. అప్పుడు మ్యాచ్‌లో నాకు పాండ్యా బౌలింగ్ చేస్తూ నన్ను స్లెడ్జ్ చేశాడు. అసలు ఎందుకు అలా స్లెడ్జ్ చేశాడో అర్థం కాలేదు. అతడి బౌలింగ్‌లో ధాటిగా ఆడేందుకు ట్రై చేశాను. […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తనకు హార్ధిక్ పాండ్యాకు మధ్య దేశవాళీ క్రికెట్‌లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వివరించాడు. పాండ్యా తనను ఒకసారి స్లెడ్జింగ్ చేశాడని చెప్పాడు. ‘నేను రంజీ సీజన్ ఆడే సమయంలో ఒకసారి బరోడాతో వన్డే మ్యాచ్ ఆడాం. అప్పుడు మ్యాచ్‌లో నాకు పాండ్యా బౌలింగ్ చేస్తూ నన్ను స్లెడ్జ్ చేశాడు. అసలు ఎందుకు అలా స్లెడ్జ్ చేశాడో అర్థం కాలేదు. అతడి బౌలింగ్‌లో ధాటిగా ఆడేందుకు ట్రై చేశాను. ఒక బంతి కొడితే అది నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. దీంతో అతను మరింతగా రెచ్చగొడుతూ మాట్లాడాడు. రా.. నా.. బంతులు ఆడు.. ఇది అండర్ 19 క్రికెట్ కాదు అంటూ పదే పదే స్లెడ్జ్ చేశాడు’ అని గిల్ చెప్పాడు. కాగా, ఆ తర్వాత ఇది తలచుకుంటే నాకు చాలా సరదాగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మాన్‌గా గుర్తింపు లభించింది.