మీ ప్రేమ పొందడం అదృష్టం : శృతి
లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు ‘శృతిహాసన్’ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. బాలీవుడ్లో ‘లక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత తెలుగులో సిద్దార్థ్ సరసన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో నటించి మెప్పించింది. వండర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్‌ను సైతం సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి 7th సెన్స్, 3, గబ్బర్ సింగ్, రేసు గుర్రం చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న శృతి.. త్వరలో […]
లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు ‘శృతిహాసన్’ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. బాలీవుడ్లో ‘లక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత తెలుగులో సిద్దార్థ్ సరసన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో నటించి మెప్పించింది. వండర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్‌ను సైతం సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి 7th సెన్స్, 3, గబ్బర్ సింగ్, రేసు గుర్రం చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న శృతి.. త్వరలో క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది. అటు కోలీవుడ్‌లోనూ రాణిస్తున్న శృతి.. సింగర్‌గాను దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకుంది.
అయితే తాను ఇండస్ట్రీకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది శృతి. ‘నటిగా మీ ప్రేమాభిమానాలు పొందడం ఆశీర్వాదంగా భావిస్తున్నా.. ఇంకా చేయాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని’ అభిమానులను కోరింది.
https://www.instagram.com/p/CDBH5MJBqsp/?igshid=wqj5k4ilpgc3