ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టిన శృతి

హీరోయిన్లకు ఫిట్‌నెస్ కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కొంచెం వెయిట్ పెరిగినా చాలు.. కష్టపడి కసరత్తులు చేస్తూ సన్నజాజుల్లా తయారవుతారు. ఈ క్రమంలో స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు నోరూరిస్తున్నా సరే.. కాస్త కంట్రోల్‌లోనే ఉంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఐరన్‌లెగ్‌గా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత నోరు పారేసుకున్న వాళ్ల దగ్గరే గోల్డెన్ చాన్స్‌లు దక్కించుకున్న హీరోయిన్ శృతి హాసన్. ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా కనిపించని ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. అయితే […]

Update: 2020-07-05 05:29 GMT

హీరోయిన్లకు ఫిట్‌నెస్ కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కొంచెం వెయిట్ పెరిగినా చాలు.. కష్టపడి కసరత్తులు చేస్తూ సన్నజాజుల్లా తయారవుతారు. ఈ క్రమంలో స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు నోరూరిస్తున్నా సరే.. కాస్త కంట్రోల్‌లోనే ఉంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఐరన్‌లెగ్‌గా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత నోరు పారేసుకున్న వాళ్ల దగ్గరే గోల్డెన్ చాన్స్‌లు దక్కించుకున్న హీరోయిన్ శృతి హాసన్. ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా కనిపించని ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా తను జాగింగ్‌కు వెళ్లిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

లాక్‌డౌన్ తర్వాత అందరూ తమ తమ పనుల్లో బిజీగా మారుతూ.. మళ్లీ రెగ్యులర్ లైఫ్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శృతి హాసన్ కూడా.. తన ఫిజిక్ తిరిగి పొందేందుకు జాగింగ్ చేస్తోంది. బ్లాక్ యోగా ప్యాంట్‌తో పాటు బ్లాక్ టీ షర్ట్ ధరించి, ముక్కుకు మాస్క్ పెట్టుకుని చాలా ప్రొటెక్టివ్‌గా జాగింగ్ చేస్తోంది. అలానే తను సిగరెట్ మానేసి 100 రోజులు పూర్తయినట్లు ఇటీవలే ట్వీట్ చేసిందీ చిన్నది. ప్రస్తుతం ‘క్రాక్‌’ సినిమాతో పాటు విజయ్ సేతుపతి లాభం సినిమాలోనూ నటిస్తోంది.

Tags:    

Similar News