అలా చెప్పేందుకు సిగ్గుపడను : శృతి

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తనకు తానుగా ఎదిగి, హీరోయిన్‌గా సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ప్రూవ్ చేసుకుంది. ముందుగా తండ్రి కమల్ ‘ఈనాడు’ సినిమాకు మ్యూజిక్ అందించి, ఆ తర్వాతనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేసిన ఈ భామ తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్, ఈవెంట్స్‌తోనూ మెప్పించింది. అయితే ఈ మధ్య తనపై కామెంట్స్ చేస్తున్న వారికి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. ‘నేను కొంత […]

Update: 2020-02-28 01:40 GMT

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తనకు తానుగా ఎదిగి, హీరోయిన్‌గా సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ప్రూవ్ చేసుకుంది. ముందుగా తండ్రి కమల్ ‘ఈనాడు’ సినిమాకు మ్యూజిక్ అందించి, ఆ తర్వాతనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేసిన ఈ భామ తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్, ఈవెంట్స్‌తోనూ మెప్పించింది. అయితే ఈ మధ్య తనపై కామెంట్స్ చేస్తున్న వారికి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచింది.

‘నేను కొంత మందికి కొన్ని చెప్పదలుచుకుంటున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ స్టార్ట్ చేసిన శృతి విమర్శకుల చెంప చెళ్లుమనేలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘నా హార్మోన్ల దయతో నేను ఇప్పటి వరకు మానసికంగా, శారీరకంగా హ్యాపీగా ఉండగలిగాను. హార్మోన్లతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండేందుకు ట్రై చేస్తున్నాను. శారీరక మార్పులు అంత సులభం కాదు, కానీ నా ప్రయాణాన్ని ఎంచుకోవడం నాకు సులభం. ఇలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం మాత్రం అస్సలు బాగాలేదు. ఇది నా జీవితం..నా ముఖం..అవును నాకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. అలా చెప్పేందుకు నేను సిగ్గుపడను. కానీ మీకు దీంతో సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ముందుగా ఇతరుల మనస్సులను, శరీర మార్పులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇతరులను ప్రేమించేందుకు ట్రై చేయండి, అంతే కానీ ఇలాంటి విమర్శలు చేయకండి’ అని సజెస్ట్ చేసింది. నన్ను నేను ప్రేమించుకునేందుకు ప్రతీ రోజు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంతో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నాతో నాకుంది.. మీకు కూడా ఉందని నమ్ముతున్నాను అని తెలిపింది. మొత్తానికి ఇతరులపై కాన్సంట్రేషన్ ఆపి మీ పని మీరు చూసుకోమ‘ని చెప్పకనే చెప్పింది శృతి.

Tags:    

Similar News