శ్రేయస్ అయ్యర్ ఔట్.. కెప్టెన్‌గా రిషబ్ పంత్?
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌పై తొలి వన్డేను గెలుచుకుని రేపు రెండో వన్డేకి సిద్ధమవుతున్న టీమిండియాకి షాక్ తగిలింది. బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఫీల్డింగ్ సమయంలో 8వ ఓవర్‌లో బౌండరీకి వెళుతున్న బాల్‌ని ఆపే క్రమంలో శ్రేయస్ భుజానికి గాయమైంది. దీంతో గ్రౌండ్ నుంచి శ్రేయస్ బయటికి వెళ్లిపోయాడు. శ్రేయస్‌కి బీసీసీఐ మెడికల్ టీమ్ స్కానింగ్ నిర్వహించగా.. గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని సూచించారు. భుజానికి సర్జరీ చేయాల్సి […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌పై తొలి వన్డేను గెలుచుకుని రేపు రెండో వన్డేకి సిద్ధమవుతున్న టీమిండియాకి షాక్ తగిలింది. బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఫీల్డింగ్ సమయంలో 8వ ఓవర్‌లో బౌండరీకి వెళుతున్న బాల్‌ని ఆపే క్రమంలో శ్రేయస్ భుజానికి గాయమైంది. దీంతో గ్రౌండ్ నుంచి శ్రేయస్ బయటికి వెళ్లిపోయాడు.
శ్రేయస్‌కి బీసీసీఐ మెడికల్ టీమ్ స్కానింగ్ నిర్వహించగా.. గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని సూచించారు. భుజానికి సర్జరీ చేయాల్సి ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో తర్వాతి రెండో మ్యాచ్‌ల నుంచి అయ్యర్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించింది. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ లేదా శుభమన్ గిల్‌కి అవకాశం దక్కనుంది.
అయితే గాయం కారణంగా వచ్చే నెల 9వ తేదీ నుంచి జరగనున్న ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లకి అయ్యర్ దూరం కానున్నాడని సమాచారం. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అయ్యర్ దూరమైతే.. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.