కరోనా మృతిపై హెచ్‌ఆర్సీ స్పందన
దిశ ప్రతినిధి, నల్లగొండ: దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నల్లగొండ జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి ఘటనపై హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆగష్టు 21లోగా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో మాడుగులపల్లి గ్రామానికి చెందిన ఓ తల్లి కళ్లెదుటే తన కుమారుడు ఆక్సిజన్ అందక ఈ నెల 18న కరోనాతో మృతి చెందాడు. బాధితుడు ఆసుపత్రిలో ఉదయం చేరగా… సాయంత్రం వరకు ఒక్క […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నల్లగొండ జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి ఘటనపై హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆగష్టు 21లోగా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో మాడుగులపల్లి గ్రామానికి చెందిన ఓ తల్లి కళ్లెదుటే తన కుమారుడు ఆక్సిజన్ అందక ఈ నెల 18న కరోనాతో మృతి చెందాడు. బాధితుడు ఆసుపత్రిలో ఉదయం చేరగా… సాయంత్రం వరకు ఒక్క వైద్యుడు కూడా రాకపోవటంతో బెడ్ మీదనే ప్రాణాలు కోల్పోవడంపై హెచ్ ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితునికి కరోనా పరీక్షలు ఎప్పుడు చేశారు.. పాజిటివ్ అని నిర్ధారణ కాకుండానే కొవిడ్ వార్డులో ఎందుకు చేర్చారు? చేర్చుకున్నాక ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదంటూ.. సూపరింటెండెంట్‌పై హెచ్చార్సీ ప్రశ్నల వర్షం కురిపించింది. కొవిడ్ వార్డుకు ఇతరులు పోవడానికి ఆనుమతి లేనప్పుడు అతని తల్లిని ఎలా అనుమతించారు అని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించింది.