ఫుల్ కెపాసిటీతో శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించే శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు.. ఫుల్ కెపాసిటీతో నడుస్తాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఇన్నాళ్లు స్లీపర్ కోచ్‌లోని మధ్య బెర్త్‌ను సామాజిక దూరాన్ని పాటించే నిమిత్తం కేటాయించలేదు. కానీ, ఇప్పటి నుంచి మధ్య బెర్త్‌ను కూడా వలస కార్మికులకు ఉపయోగించనున్నారు. దీంతో ఒక్క శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లో ఇప్పటి వరకు 1,200 మంది ప్యాసింజర్లను చేరవేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య అటూఇటుగా 1,600లకు పెరగనుంది. అంతేకాదు, […]

Update: 2020-05-11 01:56 GMT

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించే శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు.. ఫుల్ కెపాసిటీతో నడుస్తాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఇన్నాళ్లు స్లీపర్ కోచ్‌లోని మధ్య బెర్త్‌ను సామాజిక దూరాన్ని పాటించే నిమిత్తం కేటాయించలేదు. కానీ, ఇప్పటి నుంచి మధ్య బెర్త్‌ను కూడా వలస కార్మికులకు ఉపయోగించనున్నారు. దీంతో ఒక్క శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లో ఇప్పటి వరకు 1,200 మంది ప్యాసింజర్లను చేరవేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య అటూఇటుగా 1,600లకు పెరగనుంది. అంతేకాదు, వలస కార్మికుల స్వరాష్ట్రంలో మూడు స్టాప్‌‌లు ఉంటాయని రైల్వేస్ వెల్లడించింది. గతంలో కేవలం ఒకే స్టాప్ ఉండేది. అక్కడి నుంచే స్వగ్రామాలకు వెళ్లాల్సి ఉండేది. శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లను ఫుల్ కెపాసిటీతో అంటే బోగీ సామర్థ్యానికి సరిపడా మంది వలస కార్మికులతో రైల్వేస్ నడపనుంది.

Tags:    

Similar News