ఫంక్షన్ హాల్లో పెళ్లి.. పోలీసుల నోటీసులు

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికార పార్టీకి చెందిన నేత తన సొంత ఫంక్షన్ హాల్‌లో బాజప్తా పెండ్లి తంతు జరిపారు. అంతేకాదు.. 50 మందికి మించి అనుమతి లేదన్న నిబంధనను పక్కన బెట్టి.. 100 మందికి పైగా అతిథుల మధ్య వివాహం ధూం ధాంగా జరిపించేందుకు చూశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రం న్యాల్కల్ రోడ్ ఆర్.ఎస్ కన్వేన్షన్‌లో జరిగింది. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫంక్షన్ […]

Update: 2020-06-12 08:56 GMT

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికార పార్టీకి చెందిన నేత తన సొంత ఫంక్షన్ హాల్‌లో బాజప్తా పెండ్లి తంతు జరిపారు. అంతేకాదు.. 50 మందికి మించి అనుమతి లేదన్న నిబంధనను పక్కన బెట్టి.. 100 మందికి పైగా అతిథుల మధ్య వివాహం ధూం ధాంగా జరిపించేందుకు చూశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రం న్యాల్కల్ రోడ్ ఆర్.ఎస్ కన్వేన్షన్‌లో జరిగింది. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫంక్షన్ హాల్ చేరుకున్న పోలీసులు పెండ్లి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వందకు పైగా ఉన్న బంధువులను అక్కడి నుంచి పంపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో దగ్గరి బంధువుల నడుమ వివాహ కార్యక్రమం జరిపించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌ నిర్వహాకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

Tags:    

Similar News