హుజురాబాద్‌లో భారీ ట్విస్ట్.. మంత్రి హరీష్ బీజేపీకి ప్రచారం చేస్తున్నారా(వీడియో)

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడు రోజులు మాత్రమే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో అన్ని పార్టీల అగ్ర నేత‌లు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వాలిపోయారు. ప్రచారంలో మాట‌ల తూట‌లు పేలుతున్నాయి. శుక్రవారం ఇల్లంద‌కుంట మండ‌లం సిరిసేడులో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ర్యాలీ వైపు టీఆర్ఎస్ శ్రేణులు దూసుకురావ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ వైపు ప్రచారం ఉత్కంఠ‌గా, ఉద్రిక్తంగా సాగుతున్న క్రమంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న […]

Update: 2021-10-22 22:19 GMT

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడు రోజులు మాత్రమే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో అన్ని పార్టీల అగ్ర నేత‌లు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వాలిపోయారు. ప్రచారంలో మాట‌ల తూట‌లు పేలుతున్నాయి. శుక్రవారం ఇల్లంద‌కుంట మండ‌లం సిరిసేడులో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ర్యాలీ వైపు టీఆర్ఎస్ శ్రేణులు దూసుకురావ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఓ వైపు ప్రచారం ఉత్కంఠ‌గా, ఉద్రిక్తంగా సాగుతున్న క్రమంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. అదేంటంటే మంత్రి హ‌రీష్‌ రావు.. టీఆర్ఎస్ పాట పాడుతూ స్వయంగా డ‌ప్పు వాయించిన ఫొటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో చ‌క్కర్లు కొడుతున్నాయి. మంత్రి డ‌ప్పు వాయించ‌డం పెద్ద విశేషం కాన‌ప్పటికీ.. ఆ వాయిస్తున్న డ‌ప్పు బీజేపీ గుర్తుల‌తో ఉన్నది కావ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మంత్రితో పాటు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కూడా ఈ డ‌ప్పు వాయింపులో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై హ‌రీష్‌ రావు మ‌ద్దతు ఎవ‌రికి అంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో, నెటిజ‌న్లు జోకులు వేసుకుంటున్నారు.

అయితే బీజేపీ గుర్తులతో ఉన్న ఈ డబ్బులను ఆ పార్టీ కార్యకర్తలే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News