ఆస్ట్రేలియా ఓపెన్.. షాకింగ్ ఎండింగ్స్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 4వ రోజు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మహిళ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, 4వ సీడ్ సోఫియా కెనిన్ ఆస్ట్రేలియా ఓపెన్ రెండవ రౌండ్‌లోనే వెనుదిరిగింది. కెనిన్ ఆడిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఇంగ్లిస్‌పై చాలా కష్టంగా నెగ్గింది. డిఫెండింగ్ చాంపియన్ అనే భయం, టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉత్కంఠ నడుమ తొలి రౌండ్‌లో కష్టపడి మ్యాచ్ నెగ్గింది. ఇక రెండో రౌండ్‌లో 65వ ర్యాంకర్ కనెపీతో తలపడిన సోఫియా […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 4వ రోజు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మహిళ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, 4వ సీడ్ సోఫియా కెనిన్ ఆస్ట్రేలియా ఓపెన్ రెండవ రౌండ్‌లోనే వెనుదిరిగింది. కెనిన్ ఆడిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఇంగ్లిస్‌పై చాలా కష్టంగా నెగ్గింది. డిఫెండింగ్ చాంపియన్ అనే భయం, టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉత్కంఠ నడుమ తొలి రౌండ్‌లో కష్టపడి మ్యాచ్ నెగ్గింది. ఇక రెండో రౌండ్‌లో 65వ ర్యాంకర్ కనెపీతో తలపడిన సోఫియా కెనిన్ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. ఆటలో ఏ నిమిషంలోనూ చాంపియన్ లాగ ఆడలేదు. కెనిన్ బలహీనతను కాయా కనెపీ ఉపయోగించుకొని 6-3, 6-2 తేడాతో విజయం సాధించి సగర్వంగా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
వైల్డ్ కార్డ్ ద్వారా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రవేశించిన సుమిత్ నగల్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన మూడవ మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన అంకిత రైన తొలి మహిళల సింగిల్స్ రౌండ్‌లోనే ఓడిపోయింది. రొమేనియాకు చెందిన మిహిల బుజరెన్కుతో జరిగిన మ్యాచ్‌లో 3-6, 0-6 తేడాతో ఘోర ఓటమి పాలయ్యింది. కేవలం గంట 17 నిమిషాల్లో మ్యాచ్ ముగియడం గమనార్హం.
ఇక మెన్స్ డబుల్స్‌లో కూడా దివిజ్ శరణ్ ఓటమి పాలయ్యాడు. తన జోడీ అయిన ఇగొర్ జిలేనీతో కలసి ఆడిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జర్మనీ జోడి హాఫ్‌మన్, కెవిన్ చేతిలో 1-6, 4-6 తేడాతో ఓడిపోయారు. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, జపాన్‌కు చెందిన బెన్ మెక్‌లాచ్‌లన్ తమ తొలి రౌండ్ మెన్స్ డబుల్ మ్యాచ్‌లో కొరియా జోడి జి సంగ్ నమ్, మిన్ క్యూ సోంగ్ చేతిలో 4-6, 6-7(0) తేడాతో ఓడిపోయారు. కొరియా జంట వైల్డ్ కార్డ్ ద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతుండటం విశేషం. దీంతో తొలి రౌండ్‌లోనే భారత టెన్నిస్ ఆటగాళ్ల ప్రస్థానం ముగిసిపోయినట్లైంది.
మాజీ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరొలినా ప్లిస్కోవా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన డానిల్ కొలిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-5, 6-2 తేడాతో విజయం సాధించింది. అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్ క్వాలిఫయర్ ఓల్గా డానిలోవిక్‌ను 6-2, 6-3 తేడాతో ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.