ఇక బాదుడే.. SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనపు ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు డెబిట్ కార్టు ద్వారా పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే, తాజాగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకునేవారి నుంచి భారీగా ఫీజును వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజును SBI వసూలు చేయనుంది. […]

Update: 2021-11-13 06:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనపు ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు డెబిట్ కార్టు ద్వారా పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే, తాజాగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకునేవారి నుంచి భారీగా ఫీజును వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజును SBI వసూలు చేయనుంది. అంతేకాకుండా ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై ఇంట్రెస్ట్ కూడా వసూలు చేయనుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మర్చంట్‌ ఔట్‌లెట్‌, వెబ్‌సైట్‌, యాప్‌లలో చేసే అన్ని రకాల ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ఇంట్రెస్ట్ వసూలు చేయనున్నారు. అయితే, ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా తన కస్టమర్లకు ఎస్బీఐ తెలియజేసింది.

READ : SBI Debit Card EMI : షాపింగ్ చేయడానికి ఈజీగా లోన్ పొందండిలా..

Tags:    

Similar News