అక్కడలా.. ఇక్కడిలా.. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు విభిన్న తీర్పు

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు విభిన్న తీర్పునిచ్చాయి. ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం వ్యతిరేకతను చూపించారు. ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికపై అక్కడి అధికార పార్టీ వైఎస్సార్​సీపీ పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు. ఆ జిల్లా నేతలే ప్రచారం చేసుకున్నారు. ఒకదశలో అక్కడ పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు కూడా వెనకడుగు వేశాయి. కారణాలేమైనా.. టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థిని దింపలేదు. జనసేన నుంచి ఏకంగా పవన్​ కళ్యాణ్​ […]

Update: 2021-11-02 02:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు విభిన్న తీర్పునిచ్చాయి. ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం వ్యతిరేకతను చూపించారు. ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికపై అక్కడి అధికార పార్టీ వైఎస్సార్​సీపీ పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు. ఆ జిల్లా నేతలే ప్రచారం చేసుకున్నారు. ఒకదశలో అక్కడ పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు కూడా వెనకడుగు వేశాయి. కారణాలేమైనా.. టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థిని దింపలేదు. జనసేన నుంచి ఏకంగా పవన్​ కళ్యాణ్​ పోటీ చేస్తానని ప్రకటించి మాట మార్చారు. అక్కడ అధికార పార్టీ విజయం సాధిస్తుందనే నివేదికలతోనే ప్రతిపక్షాలు వెనకంజ వేసినట్లు ప్రచారం.

బద్వేల్​ ఉప ఎన్నికలో వైఎస్సార్​సీపీ అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్​ అభ్యర్థులకు కనీసం డిపాజిట్​ కూడా రాలేదు. 90,089 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం సాధించారు. ఇదే సమయంలో తెలంగాణలోని హుజురాబాద్​ ఉప ఎన్నిక కూడా జరగ్గా.. ఇక్కడి పరిస్థితి భిన్నంగా మారింది. ఐదుగురు మంత్రులు అక్కడే మకాం వేయగా.. పలువురు మంత్రులు వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. కొత్త పథకాలను ప్రకటించారు. పోలింగ్​ రోజు వరకు కూడా ఓటుకు రూ. 6 వేల చొప్పున పంపిణీ చేసిన విషయం బహిర్గతమైంది. కొన్నిచోట్ల రూ. 10 వేలు పంచినట్లు కూడా ప్రచారం జరిగింది. నువ్వా.. నేనా అన్నట్టు ప్రచారం సాగింది. ప్రలోభాలు, బెదిరింపుల పర్వానికి దిగినా.. హుజురాబాద్​ సెగ్మెంట్​ ఓటర్లు అధికార పార్టీని తిరస్కరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు పట్టం కట్టారు.

Tags:    

Similar News