కవితకు షాక్.. ఆస్తులపై ఈడీకి కంప్లైంట్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని జాయింట్ డైరెక్టర్‌కు బుధవారం లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్ పోటీచేసింది మొదలు ఇప్పటివరకు ఆమె స్థిరాస్తులు, చరాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని, ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయంటూ సంవత్సరాలవారీగా వివరాలను ఆ ఫిర్యాదుతో కలిపి అందజేశారు. భర్త పేరు మీద […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని జాయింట్ డైరెక్టర్‌కు బుధవారం లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్ పోటీచేసింది మొదలు ఇప్పటివరకు ఆమె స్థిరాస్తులు, చరాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని, ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయంటూ సంవత్సరాలవారీగా వివరాలను ఆ ఫిర్యాదుతో కలిపి అందజేశారు. భర్త పేరు మీద కూడా కొత్తగా కంపెనీల్లో వాటాలు, డైరెక్టర్ పోస్టుల గురించి వివరించారు. ఈ ఏడేళ్ళ కాలంలో ఎక్కడెక్కడ ఎంతెంత వ్యవసాయ భూములను, నివాస స్థలాలను కొన్నారో, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ ఎంత ఉందో కూడా ఆ ఫిర్యాదుతో జతచేశారు. జూలై 10వ తేదీన ఫిర్యాదు చేసిన తర్వాత ఈడీ నుంచి ఎలాంటి కదలిక లేదని, మరోసారి గుర్తుచేయాల్సి వస్తున్నదని ఈడీకి బక్క జడ్సన్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కేవలం తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మాత్రమే ప్రజలకు ఆమె పరిచయమని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నందున అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలను పోగుచేసుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈడీ చొరవ తీసుకుని లోతైన దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జాయింట్ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన జేడీ పరిశీలిస్తామని తెలిపినట్లు బక్క జడ్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌పైన ఫిర్యాదు చేసిన నాలుగైదు రోజుల వ్యవధిలోనే కల్వకుంట్ల కవితపై కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం గమనార్హం. కవితకు సంబంధించిన కొన్ని ఫామ్ హౌజ్‌లు, బంగళాలు, నివాస స్థలాల ఫోటోలను కూడా ఫిర్యాదుతో జతచేశారు.