వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో భారత్-పాకిస్థాన్.. షోయబ్ అక్తర్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో భారీ అంచనాల మధ్య జరిగిన దాయాదుల మ్యాచ్ చివరికి భారత అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మ్యాచ్‎కి ముందు అటు చరిత్ర చూసుకున్న ఇటు జట్టును చూసుకున్నా.. ఇలా అన్నీ అంశాలు భారత్‌కే సానుకూలంగా ఉన్నాయి. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాకిస్థాన్ మాత్రం భారత్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అనూహ్యాంగా విజయం సాధించింది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లపై […]

Update: 2021-10-26 07:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో భారీ అంచనాల మధ్య జరిగిన దాయాదుల మ్యాచ్ చివరికి భారత అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మ్యాచ్‎కి ముందు అటు చరిత్ర చూసుకున్న ఇటు జట్టును చూసుకున్నా.. ఇలా అన్నీ అంశాలు భారత్‌కే సానుకూలంగా ఉన్నాయి. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాకిస్థాన్ మాత్రం భారత్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అనూహ్యాంగా విజయం సాధించింది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం పై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ ఓడిపోవడంతోనే భారత్ సగం మ్యాచ్ కోల్పోయిందన్నాడు. ‘మ్యాచ్‌లో ‘మంచు’ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బౌలర్ల అవకాశాలను దెబ్బతీసింది. మంచు ఉన్నప్పుడు బంతి బౌలర్లకు పట్టుచిక్కదు. అంతేకాకుండా అటు స్వింగ్, ఇటు స్పిన్ అవ్వదు. టాస్ గెలిచిన పాకిస్థాన్‌కు ఈ విషయంలో అడ్వాంటేజ్ లభించింది. వరుస వికెట్లు తీసి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. మంచు కారణంగానే భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేయలేకపోయారు. ఇక భారత మీడియా అతి చేయడం కూడా ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి నెలకొల్పిందని పాకిస్థాన్ చేతిలో ఓడితే నేరమన్నట్లుగా పరిస్థితులను క్రియేట్ చేశారు. కానీ, ఇది క్రికెట్ గేమ్. మ్యాచ్ అన్నప్పుడు విన్నర్‌తో పాటు లూజర్ కూడా ఉంటాడు.’అని అక్తర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

పాక్ చేతిలో ఓడినా భారత్ ఫైనల్ చేరగలదనే నమ్మకం తనకు ఉందని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే. అయితే ఫైనల్ చేరే ప్రయాణం టీమిండియాకు కఠినంగా మారింది. భారత ఆటగాళ్లు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. అంతమాత్రాన తమ స్టార్ ఆటగాళ్లను అభిమానులు తిట్టాల్సిన పనిలేదు. ఇండియా ఇప్పటికీ ఫైనల్ చేరగలదు. ఫైనల్లో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నా.’అని అక్తర్ తెలిపాడు.

Tags:    

Similar News