Shilpa Shetty : ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం స్వేదం చిందిద్దాం :
దిశ, సినిమా : యోగా, బ్యూటీ టిప్స్‌తో ఇన్‌ఫర్మేటివ్ వీడియోలు పోస్ట్ చేసే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి.. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. రోజంతా పీపీఈ కిట్లు ధరించి, డీహైడ్రేషన్‌కు గురవుతున్న ట్రూ చాంపియన్స్‌కు మన మన ప్రేమ, మద్దతు అవసరమని అభిప్రాయపడింది. కఠిన పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలందిస్తున్న కొవిడ్ వారియర్స్ కోసం ఇండియాలోని ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ ‘ఫాస్ట్ అండ్ అప్’ చేపట్టిన ‘హీల్-ప్రే-లవ్’ ఇనిషియేటివ్ ‘#HealWithReels […]
దిశ, సినిమా : యోగా, బ్యూటీ టిప్స్‌తో ఇన్‌ఫర్మేటివ్ వీడియోలు పోస్ట్ చేసే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి.. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. రోజంతా పీపీఈ కిట్లు ధరించి, డీహైడ్రేషన్‌కు గురవుతున్న ట్రూ చాంపియన్స్‌కు మన మన ప్రేమ, మద్దతు అవసరమని అభిప్రాయపడింది. కఠిన పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలందిస్తున్న కొవిడ్ వారియర్స్ కోసం ఇండియాలోని ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ ‘ఫాస్ట్ అండ్ అప్’ చేపట్టిన ‘హీల్-ప్రే-లవ్’ ఇనిషియేటివ్ ‘#HealWithReels ద్వారా స్వేదం చిందిద్దామని పిలుపునిచ్చింది.
ఈ మేరకు తన వర్కవుట్ వీడియోను మెసేజ్‌తో పాటు షేర్ చేసింది. ఒక మంచి ఫలితం కోసం చెమట చిందించేందుకు ప్రతిజ్ఞ చేశానని.. మీరు కూడా దేశం కోసం పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం స్వేదం చిందిస్తూ ప్రార్థించాలని, వారు మరింత యాక్టివ్‌గా పనిచేసేందుకు సాయపడాలని కోరింది. చెమటపట్టేలా మీరు చేసిన ఏదైనా పనికి సంబంధించిన వీడియోకు రీల్స్ ఫీచర్‌లో ‘లడ్ లేంగే’ సాంగ్ యాడ్ చేసి @fastandup_india and #HealWithReelsతో పాటు తనకు ట్యాగ్ చేయాలని సూచించింది. యూజర్స్ పంపే ఒక్కో రీల్ వీడియో.. డీహైడ్రేట్‌కు గురైన ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు ఎలక్ట్రోలైట్స్ అందజేస్తుందని తెలిపింది.