క్వారంటైన్‌ సెంటర్‌లో ‘గబ్బర్’

టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (గబ్బర్) ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో చేరాడు. కొన్ని రోజులుగా జర్మనీలో ఉన్న ధావన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా, కరోనా భయాందోళన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధావన్‌ను కూడా ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనంలో ఉంచారు. దీనికి సంబంధించి ధావన్ ఒక వీడియోను సోషల్ మీడియాలో […]

Update: 2020-03-18 03:56 GMT

టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (గబ్బర్) ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో చేరాడు. కొన్ని రోజులుగా జర్మనీలో ఉన్న ధావన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా, కరోనా భయాందోళన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధావన్‌ను కూడా ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనంలో ఉంచారు. దీనికి సంబంధించి ధావన్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ప్రస్తుతం నేను క్వారంటైన్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరినీ వైద్యులు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పరిశుభ్రమైన గది కేటాయించారు. ప్యాకేజ్డ్ వాటర్‌తో పాటు రుచికరమైన భోజనం, శుభ్రమైన చెప్పులు అందించారని’ ధావన్ పేర్కొన్నాడు. వైరస్ నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని అతడు మెచ్చుకున్నాడు.

tags : Shikhar Dhawan, Quarantaine centre, Delhi, Germany, Social media

Tags:    

Similar News