మహిళల ఉపాధి కోసం SHG స్టోర్స్..
మహిళలకు గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భాగమైన సెర్ప్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో జనగామ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని 12 మండలాలకు గాను మొత్తంగా 200 ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌ను త్వరలో ప్రారంభిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్టోర్స్ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. దిశ, జనగామ: మహిళా సంఘాలు ఏర్పాటైన ఎస్‌హెచ్‌జీ ఐడీ సభ్యుల్లో గ్రామానికో స్టోర్ చొప్పున ఏర్పాటు చేస్తారు. కొందరు మహిళలకు […]
మహిళలకు గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భాగమైన సెర్ప్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో జనగామ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని 12 మండలాలకు గాను మొత్తంగా 200 ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌ను త్వరలో ప్రారంభిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్టోర్స్ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు.
దిశ, జనగామ: మహిళా సంఘాలు ఏర్పాటైన ఎస్‌హెచ్‌జీ ఐడీ సభ్యుల్లో గ్రామానికో స్టోర్ చొప్పున ఏర్పాటు చేస్తారు. కొందరు మహిళలకు స్టోర్‌లో అవసరమైన సరుకులను వారి గ్రామాల్లోనే నాణ్యతతో అందించేలా శిక్షణ ఇస్తున్నారు. దీంతో జిల్లాలోని 10,420 మహిళా సంఘాలు, 455 గ్రామ సంఘాలు కలిపి మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,18,578 లక్షల మంది మహిళలకు ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం సక్రమంగా జరిగేలా, గ్రామాల్లో తయారు చేసిన వస్తువులు, కిరాణా సరుకులను వేరే ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు బైరిసన్స్ సంస్థతో సెర్చ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ప్రతి మహిళకు సుమారు రూ. పది వేలు సంపాదించుకునే వీలుంది.
మొత్తం 200 స్టోర్స్..
జిల్లాలో 200 స్టోర్స్ ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే పలు మండలాల్లో 60కిపైగా స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళలకు డీఆర్డీఏ శాఖ ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నారు. త్వరలోనే స్టోర్స్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించనున్నారు
మహిళలకు మంచి అవకాశం..
గ్రామాల్లో ఉపాధి లేని మహిళలకు ఇది మంచి అవకాశం. ఇప్పటి వరకు జిల్లాలో 60 స్టోర్స్ పనులు పూర్తయ్యాయి. జనగామ, పాలకుర్తి, కొడకండ్ల, లింగాల ఘన్‌పూర్‌లో త్వరలోనే మంత్రి ప్రారంభిస్తారు.
-సదానందం, సెర్ప్ జిల్లా కోఆర్డినేటర్