మా మనోభావాలు దెబ్బతిన్నాయి.. నటుడు మోహన్ బాబుపై కేసు పెట్టండి
దిశ, తొర్రూరు : సినీ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో సినీ నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. మంచు విష్ణు మా ఎన్నికల్లో […]
దిశ, తొర్రూరు : సినీ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో సినీ నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొర్రెల కాపరులను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారని.. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందని, అందరూ చూస్తున్నారని మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు.
ఆ కామెంట్స్ వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మాటేడు సర్పంచ్ వల్లపు శోభ యాకయ్య యాదవ్, జీఎంపీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మన బోయిన యాకయ్య, జిల్లా నాయకులు చెను రామకృష్ణ, నూకల హరీష్, బొల్లం అనిల్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.