కనికా స్నేహితురాలికి కరోనా
దిశ, వెబ్‌డెస్క్: సింగర్ కనికా కపూర్ .. కోవిడ్ 19 వ్యాధి సంక్రమించిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీ. ప్రస్తుతం ఆమె కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా… మరో సెలబ్రిటీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. షారుక్ ఖాన్, దీపికా పడుకోన్ జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: సింగర్ కనికా కపూర్ .. కోవిడ్ 19 వ్యాధి సంక్రమించిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీ. ప్రస్తుతం ఆమె కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా… మరో సెలబ్రిటీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. షారుక్ ఖాన్, దీపికా పడుకోన్ జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తుండగా… షాజాకు పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్‌లు చేస్తున్నారు వైద్యులు. లాక్ డౌన్‌కు ముందే షాజా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చేసిందని చెబుతున్నారు కుటుంబీకులు. అయితే షాజా మొరానీ .. కనికా కపూర్ స్నేహితురాలు కాగా… తన వల్లే షాజాకు కరోనా సంక్రమించిందేమో అని కొందరు అనుమానిస్తున్నారు.
కనికా కపూర్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని విమర్శలు ఎదుర్కొంది. ప్రముఖులతో పార్టీలకు హాజరుకావడంపై మండిపడ్డారు. కనికాకు కరోనా వైరస్ సంక్రమించడంతో లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా… పేషెంట్లా కాకుండా సెలబ్రిటీలా వ్యవహరిస్తుందని వైద్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయిన ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా.. నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం మరోసారి టెస్ట్ చేయగా కరోనా నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
Tags : Kanika Kapoor, Shaza Morani, Kanika Friend, Corona, CoronaVirus, Covid19