పార్టీ ఓకే.. కానీ పోలీసులతో జాగ్రత్త :షారుఖ్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. లేటైనా లేటెస్ట్‌గా న్యూ ఇయర్ విషెస్ అందించారు. 2021 అందరికీ.. బిగ్గర్, బెటర్, బ్రైటర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకున్నారు. 2020 వరెస్ట్ ఇయర్ అయినా సరే, రియల్ పీపుల్‌తో రియల్ ఫన్ ఏంటో రుచి చూపించిందని.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఇచ్చిందన్నారు. లైఫ్‌లో లోయెస్ట్ మూమెంట్స్ తర్వాత గుడ్ థింగ్స్ వస్తాయని నమ్ముతానని.. 2020లో హార్డ్ సిట్యుయేషన్స్ చూశాం కాబట్టి 2021 […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. లేటైనా లేటెస్ట్‌గా న్యూ ఇయర్ విషెస్ అందించారు. 2021 అందరికీ.. బిగ్గర్, బెటర్, బ్రైటర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకున్నారు. 2020 వరెస్ట్ ఇయర్ అయినా సరే, రియల్ పీపుల్‌తో రియల్ ఫన్ ఏంటో రుచి చూపించిందని.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఇచ్చిందన్నారు. లైఫ్‌లో లోయెస్ట్ మూమెంట్స్ తర్వాత గుడ్ థింగ్స్ వస్తాయని నమ్ముతానని.. 2020లో హార్డ్ సిట్యుయేషన్స్ చూశాం కాబట్టి 2021 ఆనందం, శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ప్రతీ ఒక్కరి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలని విష్ చేశాడు. ఈ ఏడాది మరింత రొమాంటిక్‌గా, అమేజింగ్‌గా ఉండాలని కోరుకున్న షారుఖ్.. పార్టీ చేసుకోండి కానీ అంత హార్డ్‌గా వద్దని సూచించాడు. మరీ ఎక్కువగా తాగి.. బట్టలు చించుకుని వీధుల్లో పరుగులు పెడితే, పోలీసులు అరెస్ట్ చేయగలరు జాగ్రత్తని హెచ్చరించాడు. చివరగా 2021లో మీ అందరినీ బిగ్ స్క్రీన్‌పై మీట్ అవుతానంటూ అభిమానులకు హ్యాపీ న్యూస్ చెప్పి ముగించాడు షారుఖ్.
దీంతో షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’(#Pathan) ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. (#KING SRK IN THEATRES IN 2021) కింగ్ ఎస్ఆర్‌కే ఇన్ థియేటర్స్ ఇన్ 2021, షారుఖ్ ఖాన్ పేరుతో ట్రెండ్ అవుతుంది.