ముక్కును నేలకు రాసి పో.. కేసీఆర్‌కు షర్మిల సలహా

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్/వనపర్తి: ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘మీది గుండెనా లేక రాతి బండనా..? అని TSYSRCP రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపత్రి గ్రామంలో.. ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న కొండల్ ఇంటి ఎదుట బాధిత తల్లిదండ్రులు, నాయకులు కార్యకర్తలతో కలిసి నిరుద్యోగ దీక్షను ప్రారంభించారు వైఎస్ షర్మిల. ముందుగా తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి […]

Update: 2021-07-13 01:02 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్/వనపర్తి: ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘మీది గుండెనా లేక రాతి బండనా..? అని TSYSRCP రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపత్రి గ్రామంలో.. ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న కొండల్ ఇంటి ఎదుట బాధిత తల్లిదండ్రులు, నాయకులు కార్యకర్తలతో కలిసి నిరుద్యోగ దీక్షను ప్రారంభించారు వైఎస్ షర్మిల. ముందుగా తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షను ప్రారంభిస్తూ ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని ఆరోపించారు. ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిగా చేసి ఎక్కడికైనా వెళ్లండి.. నిరుద్యోగుల బాధలు తీరుతాయి అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News