సైఫ్ చెంప పగలగొట్టిన హీరోయిన్.. షర్మిళ రియాక్షన్?
దిశ, సినిమా : సైప్ అలీఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్ చాహ్‌తా హై’ మూవీ రీసెంట్‌గా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2001 ఆగస్టు 10న విడుదలైన చిత్రంలో సైఫ్‌కు జోడీగా నటించిన సుచిత్ర పిళ్లై.. సినిమాలో చోటుచేసుకున్న ఇన్సిడెంట్‌పై అతడి తల్లి షర్మిళ ఠాగూర్‌తో జరిగిన సంభాషణను తాజాగా గుర్తుచేసుకుంది. ఇందులో డిమాండింగ్, డామినేటింగ్ గర్ల్‌ఫ్రెండ్ ప్రియా పాత్రలో కనిపించిన సుచిత్ర.. ఓ సీన్‌లో భాగంగా సైఫ్‌ను చెంపదెబ్బ కొట్టాల్సి […]
దిశ, సినిమా : సైప్ అలీఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్ చాహ్‌తా హై’ మూవీ రీసెంట్‌గా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2001 ఆగస్టు 10న విడుదలైన చిత్రంలో సైఫ్‌కు జోడీగా నటించిన సుచిత్ర పిళ్లై.. సినిమాలో చోటుచేసుకున్న ఇన్సిడెంట్‌పై అతడి తల్లి షర్మిళ ఠాగూర్‌తో జరిగిన సంభాషణను తాజాగా గుర్తుచేసుకుంది. ఇందులో డిమాండింగ్, డామినేటింగ్ గర్ల్‌ఫ్రెండ్ ప్రియా పాత్రలో కనిపించిన సుచిత్ర.. ఓ సీన్‌లో భాగంగా సైఫ్‌ను చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందట. అయితే సినిమా రిలీజైన తర్వాత సుచిత్ర ఒక పార్టీలో సైఫ్ మదర్ షర్మిళా ఠాగూర్‌ను కలిసినప్పుడు ‘మేడమ్! నేను ‘దిల్ చాహ్‌తా హై’ సినిమాలో సైఫ్‌ను కొట్టిన సుచిత్ర.. గుర్తుపట్టారా? అని అడిగిందట. అందుకు షర్మిళ.. అవును, చాలా గట్టిగా కొట్టావు కదా! అని రిప్లయ్ ఇవ్వడంతో ఇద్దరం పగలబడి నవ్వుకున్నామని చెప్పుకొచ్చింది సుచిత్ర. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ‘కోల్డ్ కేస్’లో కనిపించిన తను.. ప్రస్తుతం ‘మేడ్ ఇన్ హెవెన్, మసాబా మసాబా2’ చిత్రాల్లో నటిస్తోంది.