చరిత్ర సృష్టించిన శరత్ కమల్

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ప్యాడ్లర్ (టేబుల్ టెన్నిస్ ఆటగాడు) ఆచంట శరత్ కమల్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించాడు. దోహాలో జరిగిన ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ రమీజ్‌పై గెలవడం ద్వారా టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ప్యాడ్లర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో రమీజ్‌ను కేవలం 22 నిమిషాల్లో 11-4, 11-1, 11-5, 11-4 తేడాతో ఓడించి ఒలంపిక్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. కమల్ […]

Update: 2021-03-19 06:48 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ప్యాడ్లర్ (టేబుల్ టెన్నిస్ ఆటగాడు) ఆచంట శరత్ కమల్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించాడు. దోహాలో జరిగిన ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ రమీజ్‌పై గెలవడం ద్వారా టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ప్యాడ్లర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో రమీజ్‌ను కేవలం 22 నిమిషాల్లో 11-4, 11-1, 11-5, 11-4 తేడాతో ఓడించి ఒలంపిక్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. కమల్ ఒలంపిక్స్‌లో పాల్గొనడం ఇది 4వ సారి. తమిళనాడుకు చెందిన ఆచంట శరత్ కమల్ 2018 ఏషియన్ గేమ్స్ మెన్స్ టీమ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాలు, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన శరత్ కమల్‌కు కెరీర్‌లో ఇవే చివరి ఒలంపిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News