27 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న స్టార్ నటి.. ఎందుకో తెలుసా?

దిశ, సినిమా: 1991లో అక్షయ్ కుమార్ సరసన ‘సౌగంధ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది భానుప్రియ సిస్టర్ శాంతిప్రియ. కానీ కొంతకాలానికే 1994లో సినిమా ఇండస్ర్టీనుంచి తప్పుకున్న నటి ఇటీవల టాలీవుడ్ మూవీ ‘మహర్షి’ సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది. అయితే ఈసారి డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపిన ఆమె.. కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్నట్లు చెప్పిన ఆమె.. ‘1999లో […]

Update: 2021-12-07 07:37 GMT

దిశ, సినిమా: 1991లో అక్షయ్ కుమార్ సరసన ‘సౌగంధ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది భానుప్రియ సిస్టర్ శాంతిప్రియ. కానీ కొంతకాలానికే 1994లో సినిమా ఇండస్ర్టీనుంచి తప్పుకున్న నటి ఇటీవల టాలీవుడ్ మూవీ ‘మహర్షి’ సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది. అయితే ఈసారి డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపిన ఆమె.. కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్నట్లు చెప్పిన ఆమె.. ‘1999లో నటుడు సిద్ధార్థ్‌ రేను వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారిపోయాను.

దీంతో నా లైఫ్ చాలా బిజీ అయిపోయింది. అయితే 2004లోనే అనారోగ్య కారణాలతో సిద్ధార్థ్ చనిపోవడం, ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్లు కావడంతో మళ్లీ వెండితెర వైపు అడుగులేస్తున్నా’ అని చెప్పింది. ఇక ప్రస్తుతం సమిత్ కక్కడ్ దర్శకత్వంలో జీ స్డూడియోస్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘ధారావి బ్యాంక్’లో శాంతిప్రియ, సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారు.

స్టార్ హీరోయిన్ పెళ్లి.. లైవ్ స్ట్రీమింగ్‌కు 100 కోట్లు!

Tags:    

Similar News