క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. షేన్ వార్న్‌కు Accident

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌కు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. వార్న్, అతని కొడుకు ఆదివారం మెల్‌బోర్న్‌లో చాలా బరువైన బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అయి కిందపడ్డారు. ఘటన జరిగిన తర్వాత పెద్దగా దెబ్బలేమీ లేకపోవడంతో ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. అయితే సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత వార్న్ కాలు కదపలేని స్థితిలో తీవ్రంగా వాచిపోయి నొప్పిగా ఉంది. దీంతో వెంటనే వార్న్ ఆసపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స చేసి […]

Update: 2021-11-29 09:44 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌కు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. వార్న్, అతని కొడుకు ఆదివారం మెల్‌బోర్న్‌లో చాలా బరువైన బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అయి కిందపడ్డారు. ఘటన జరిగిన తర్వాత పెద్దగా దెబ్బలేమీ లేకపోవడంతో ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. అయితే సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత వార్న్ కాలు కదపలేని స్థితిలో తీవ్రంగా వాచిపోయి నొప్పిగా ఉంది. దీంతో వెంటనే వార్న్ ఆసపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

‘నాకు గాయమై తీవ్రగా నొప్పి ఉన్నది. అందుకే ఆసుపత్రికి వచ్చాను’ అని షేన్ వార్న్ మీడియాకు వెల్లడించాడు. కాగా, డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో వార్న్ కామెంటేటర్‌గా వ్యవహరించాల్సి ఉన్నది. అప్పటి కల్లా షేన్ వార్న్ కోలుకుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు యాషెస్ సిరీస్ నిర్వహణ ఇంకా సందిగ్దంగానే ఉన్నది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేరుకొని రెండు వారాలైంది. కానీ ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సరిహద్దులు మూసేయాలని భావిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు అక్కడ ఎలా ప్రయాణం చేస్తాయనే దానిపై సందిగ్దత నెలకొన్నది.

Tags:    

Similar News