ఓవైపు కెనాల్ పైపులు.. మరోవైపు భారీ వరద.. గమ్యం ఎలా చేరేది?
దిశ, రాజేంద్రనగర్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్‌లోని అప్పచెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువులోని వరద నీరంతా జాతీయ రహదారి పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ వైపు నుంచి బెంగుళూరు వైపు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు, బెంగళూరు వరకు వెళ్లాల్సిన వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డు గుండా వెళ్లాలని పోలీసులు […]
దిశ, రాజేంద్రనగర్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్‌లోని అప్పచెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువులోని వరద నీరంతా జాతీయ రహదారి పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ వైపు నుంచి బెంగుళూరు వైపు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు, బెంగళూరు వరకు వెళ్లాల్సిన వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డు గుండా వెళ్లాలని పోలీసులు సూచించారు.