మళ్లీ మైదానంలోకి షకీబుల్ హసన్
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ తిరిగి క్రికెట్ మైదానంలోనికి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 5 నుంచి బీకేఎస్పీ ఇన్‌స్టిట్యూట్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ అతనిపై విధించిన నిషేధం అక్టోబర్ 29న ముగిసిపోనుండటంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని షకీబ్ భావిస్తున్నాడు. త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న బంగ్లా జట్టు తరపున ఎంపిక అవుతానని షకీబ్ ఆశాభావంతో ఉన్నాడు. రెండో టెస్టు నుంచి అతడు జట్టుకు సేవలందించే అవకాశం ఉన్నట్టు […]
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ తిరిగి క్రికెట్ మైదానంలోనికి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 5 నుంచి బీకేఎస్పీ ఇన్‌స్టిట్యూట్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ అతనిపై విధించిన నిషేధం అక్టోబర్ 29న ముగిసిపోనుండటంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని షకీబ్ భావిస్తున్నాడు. త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న బంగ్లా జట్టు తరపున ఎంపిక అవుతానని షకీబ్ ఆశాభావంతో ఉన్నాడు.
రెండో టెస్టు నుంచి అతడు జట్టుకు సేవలందించే అవకాశం ఉన్నట్టు బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వ్యాఖ్యానించారు. గత ఐదున్నర నెలలుగా యూఎస్ఏలో ఉన్న షకీబ్ సెప్టెంబర్ 2న బంగ్లాదేశ్ చేరుకున్నాడు. తన చిన్నప్పటి కోచ్‌లు నజ్ముల్ అబెదిన్, మహ్మద్ సలావుద్దీన్‌ల పర్యవేక్షణలో శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నాడు. ఒక మ్యాచ్ సందర్భంగా బుకీలు షకీబుల్‌ను కలిసిన విషయం బీసీబీ, ఐసీసీ తెలియజేయడంలో విఫలమయ్యాడు. దీంతో ఐసీసీ అతడిపై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. అయితే తన తప్పును షకీబుల్ అంగీకరించడంతో ఆ నిషేధాన్ని ఏడాదికి తగ్గించింది.