అంతర్జాతీయ క్రికెట్‌లోకి షకీబుల్ రీఎంట్రీ
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్(Bangladesh all-rounder) షకీబుల్ హసన్(Shakib Al Hasa) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో శ్రీలంక(Sri Lanka)తో జరగనున్న పర్యటనలో పాల్గొంటాడని తెలుస్తోంది. కాగా, షకీబుల్‌ను బూకీలు సంప్రదించిన విషయాన్ని ఐసీసీ(ICC)కి తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ అతడిపై రెండేళ్ల నిషేధం(Two years ban) విధించారు. అయితే, తప్పు ఒప్పుకోవడంతో ఐసీసీ విచారణ కమిటీ(ICC Inquiry Committee) సస్పెన్షన్(Suspension)ను ఏడాదికి తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్ 29తో […]
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్(Bangladesh all-rounder) షకీబుల్ హసన్(Shakib Al Hasa) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో శ్రీలంక(Sri Lanka)తో జరగనున్న పర్యటనలో పాల్గొంటాడని తెలుస్తోంది. కాగా, షకీబుల్‌ను బూకీలు సంప్రదించిన విషయాన్ని ఐసీసీ(ICC)కి తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ అతడిపై రెండేళ్ల నిషేధం(Two years ban) విధించారు.
అయితే, తప్పు ఒప్పుకోవడంతో ఐసీసీ విచారణ కమిటీ(ICC Inquiry Committee) సస్పెన్షన్(Suspension)ను ఏడాదికి తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్ 29తో అతడిపై నిషేధం ముగిసిపోతుండటంతో రీఎంట్రీ(Re-entry)కి సిద్ధమవుతున్నాడు. కరోనా(Corona) కారణంగా వాయిదా పడిన శ్రీలంక-బంగ్లాదేశ్ సిరీస్(Sri Lanka-Bangladesh series) ఏడాది చివర్లో నిర్వహించే వీలుంది. దీంతో షకీబుల్ హసన్ ఆ సిరీస్ ద్వారానే రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
‘షకీబ్ ఒక ఏడాది పాటు జట్టుకు దూరమవడం మాకు భిన్నంగా ఏమీ అనిపించలేదు. అయితే, ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన అతనికి నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడం కష్టం కావొచ్చు. కాబట్టి అంతకు ముందే కొన్ని అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు(World class player) కాబట్టి త్వరగానే గాడిలో పడతాడని భావిస్తున్నాం’ అని బంగ్లాదేశ్ హెడ్ కోచ్ రస్సెల్ డోమింగో(Bangladesh Head Coach Russell Domingo) అన్నాడు. షకీబ్ ముందుగా ఫిట్‌నెస్(Fitness) నిరూపించుకుంటే అంతా అదే సర్థుకుంటుందని డోమింగో అభిప్రాయపడ్డాడు.