'అమ్మా'.. నీ మందలింపు మిస్ అవుతున్నా: షారుక్
కన్నడ సీనియర్ నటి కిశోరి బల్లాల్ బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దిగ్గజ నటి కిశోరి మృతిపై పలువురు, రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గొప్ప నటిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమా స్వదేశ్‌లో షారుక్ ఖాన్ తల్లిగా నటించి గొప్ప గుర్తింపు పొందారు. కిశోరి బల్లాల్ ఆకస్మిక మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు షారుక్. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. స్వదేశ్ చిత్ర […]
కన్నడ సీనియర్ నటి కిశోరి బల్లాల్ బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దిగ్గజ నటి కిశోరి మృతిపై పలువురు, రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గొప్ప నటిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ సినిమా స్వదేశ్‌లో షారుక్ ఖాన్ తల్లిగా నటించి గొప్ప గుర్తింపు పొందారు. కిశోరి బల్లాల్ ఆకస్మిక మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు షారుక్. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. స్వదేశ్ చిత్ర సమయంలో ఆమెతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న షారుక్.. కిశోరి అమ్మను చాలా మిస్ అవుతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా సిగరెట్లు కాల్చొద్దు అని చెప్పే తల్లి మందలింపును కోల్పోయానని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 1960లో సినీరంగ పరిశ్రమకు పరిచయమైన కిశోరి బెల్లాల్.. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మరాఠా భాషల్లో 75కు పైగా సినిమాలు చేశారు. టాలీవుడ్‌లో ఆమె నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం ఎప్పటికీ మరిచిపోలేరు తెలుగు ప్రేక్షకులు.