మీ విరాళం గొప్ప సందేశం : షారుక్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే తన వంతుగా గొప్ప సాయం అందించారు. తద్వారా కరోనా ప్రభావంతో బాధపడుతున్న పేదలు, సినీ వర్కర్ల ఆకలి తీర్చిన షారుక్.. ఇప్పుడు ప్రజలను రక్షించేందుకు కనబడని శత్రువుతో పోరాడుతున్న కరోనా వారియర్స్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని పిలుపునిస్తున్నారు. వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలు వైద్య సేవల్లోనే నిమగ్నమైన డాక్టర్లు, సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్ అందించేందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే తన వంతుగా గొప్ప సాయం అందించారు. తద్వారా కరోనా ప్రభావంతో బాధపడుతున్న పేదలు, సినీ వర్కర్ల ఆకలి తీర్చిన షారుక్.. ఇప్పుడు ప్రజలను రక్షించేందుకు కనబడని శత్రువుతో పోరాడుతున్న కరోనా వారియర్స్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని పిలుపునిస్తున్నారు. వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలు వైద్య సేవల్లోనే నిమగ్నమైన డాక్టర్లు, సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్ అందించేందుకు మీ వంతు సహాయాన్ని అందించాలని కోరారు. మీర్ ఫౌండేషన్ ద్వారా పీపీఈ కిట్స్ అందించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మీర్ ఫౌండేషన్ ఎప్పుడూ కూడా విరాళాలు సేకరించి సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని.. కానీ ఈ కష్టకాలంలో మనమంతా ఒక్కటే అనే భావన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మీకు వీలైనంత సహాయం.. అది చిన్నదే కావచ్చు.. కానీ అది గొప్ప సందేశాన్ని, అనుభూతిని ఇస్తుందన్నారు షారుక్. ‘రండి.. అందరం కలిసి మనల్ని రక్షిస్తున్న వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు కలిసి నడుద్దాం.. తద్వారా కరోనాను జయిద్దామని పిలుపునిచ్చారు.