బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో లో సూర్య సందడి.. సింహం-సమరసింహం కలిసిన వేళ..

బాలకృష్ణ(Balakrishna)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’('Unstoppable) షో కు తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో సూర్య(Sūrya) ముఖ్య అతిథిగా హాజరై తెగ సందడి చేశారు.

Update: 2024-11-05 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ(Balakrishna)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’('Unstoppable) షో కు తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో సూర్య(Sūrya) ముఖ్య అతిథిగా హాజరై తెగ సందడి చేశారు. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ షో కూడా ఫుల్ జోష్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇకపోతే ఈ షో కు తాజాగా హీరో హారజయ్యారు బాలయ్య.. సూర్యకు భారీ డైలాగ్స్‌ తో వెల్కమ్ చెప్పాడు. ‘నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్(Legend) అయితే అతను గజిని(Ghajini), నేను అఖండ అయితే అతను రోలాక్స్(Rolex).. వన్ అండ్ ఓన్లీ సూర్య.. వెల్కమ్ మై డియర్ సూర్య అంటూ హృదయం ఎక్కడా ఉన్నాది నీ చుట్టూతిరుగూనే ఉన్నాది అంటూ పాడుతూ సూర్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు బాలయ్య. ఇక సింహం-సమరసింహం కలిసిన వేళ సందడి మామూలుగా ఉంటుందా? ఓ లెవల్ లో ఆకట్టుకుంటుంది ప్రోమో.

బాలయ్య అడిగే ప్రశ్నలకు సూర్య సమాధానాలివ్వడం. పంచ్ లు వేసుకోవడం.. చాలా ఫన్నీగా సాగింది. కార్తి ఆయన మొబైల్‌లో సూర్య నెంబర్ ఏమని సేవ్ చేసి ఉంటుందని అడిగాడు బాలయ్య. ఇక సూర్య బదులిస్తూ.. అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ తొలి ప్రశ్నతోనే అక్కడున్నవారందినీ నవ్వులు పూయించింది. క్రష్ ఎవరని అడగ్గా.. వద్దు సార్ ఇంటికెళ్లాలని గట్టిగా నవ్వుతాడు సూర్య. గొడవలు అవుతాయని సరదాగా అంటాడు. బాలయ్య కార్తి(Karthi)కి ఫోన్ చేస్తాడు. సూర్య గురించి చెప్పమని అడగ్గా.. ఆయనకు ఓ హీరోయిన్ అంటే ఎంతో లైక్ అని చెబుతాడు. దీంతో సూర్య.. నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా అంటాడు. ఇలా సూర్య-బాలయ్య చాలా సరదాగా మాట్లాడుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More..

Pushpa-2: ట్రైలర్ త్వరలో పేలబోతోంది.. ఇంట్రెస్టింగ్‌గా పుష్ప-2 నుంచి మరో కొత్త పోస్టర్ 

Tags:    

Similar News