ఎవరినీ వదలం : అలియా సోదరి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్‌లో పలు కాంట్రవర్సీలకు దారితీసింది. నెలరోజులుగా నెపోటిజం గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. అభిమాన హీరోను పోగొట్టుకున్న ఫ్యాన్స్ నెపోటిజానికి కారణమైన వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు ఈ కామెంట్స్ తట్టుకోలేక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పగా, మరికొందరు ఏ మాత్రం స్పందించడం లేదు. ‘సుశాంత్ ఎవరో తెలియదని అలియా భట్ హేళనగా మాట్లాడిందని, బాలీవుడ్‌లో నెపోటిజాన్ని ప్రోత్సహించే వారిలో తను […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్‌లో పలు కాంట్రవర్సీలకు దారితీసింది. నెలరోజులుగా నెపోటిజం గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. అభిమాన హీరోను పోగొట్టుకున్న ఫ్యాన్స్ నెపోటిజానికి కారణమైన వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు ఈ కామెంట్స్ తట్టుకోలేక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పగా, మరికొందరు ఏ మాత్రం స్పందించడం లేదు.
‘సుశాంత్ ఎవరో తెలియదని అలియా భట్ హేళనగా మాట్లాడిందని, బాలీవుడ్‌లో నెపోటిజాన్ని ప్రోత్సహించే వారిలో తను కూడా ఒకరు’ అంటూ మండిపడుతున్న అభిమానులు.. అసభ్యకర మెసేజ్‌లు పంపించారు. ఈ వివాదంపై అలియా సైలెంట్‌గానే ఉన్నా.. తన సోదరి షహీన్ భట్ మాత్రం అలియా పడుతున్న టార్చర్ గురించి వివరించింది. అలియాను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని.. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ అలియాకు వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇవి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయా? అని ప్రశ్నించిన షహీన్.. తనకు మాత్రం అసలు ఆశ్చర్యంగా లేదని చెప్పింది. ఈ మెసేజ్‌లు పంపిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌లు షేర్ చేయాలా? లేదా? అని చాలా ఆలోచించానని.. సోషల్ మీడియా అనేది మహిళకు సేఫ్ ప్లేస్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్‌లను పోస్ట్ చేసినట్లు తెలిపింది.