లాక్‌‌డౌన్ ఎఫెక్ట్.. షహీన్‌బాగ్ ఖాళీ

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇదే బాటలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 వరకు దేశ రాజధానిని లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం షహీన్‌బాగ్‌ను పోలీసులు ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గత 101 రోజులుగా షహీన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సీఏఏ […]

Update: 2020-03-24 02:49 GMT

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇదే బాటలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 వరకు దేశ రాజధానిని లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం షహీన్‌బాగ్‌ను పోలీసులు ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గత 101 రోజులుగా షహీన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు ఆ ప్రాంతం గుండెకాయలాగా మారింది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలీసులు షహీన్‌బాగ్‌కు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఖాళీ చేసి వెళ్లిపోవాలని పలుమార్లు నిరసనకారులను కోరారు. కానీ, వారు పట్టించుకోలేదు. దీంతో 7.30 గంటలకు పోలీసులు బలవంతంగా షాహిన్‌బాగ్‌ను ఖాళీ చేయించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ అమలులో ఉందని, జనాలు ఒక దగ్గర గుమిగూడటంపై నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Tags: delhi shaheen bagh,anti-caa-protests,101-days,amid,lockdown,coronavirus

Tags:    

Similar News