కంటైన్మెంట్ జోన్‌గా మల్కాజ్‌గిరి షఫీనగర్
దిశ, మేడ్చల్: మల్కాజ్‌గిరి పరిధిలోని షఫీ నగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. షఫీ నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఉండడం వల్ల కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించామనీ, ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ జోన్‌లోని ప్రజలకు మందులు, నిత్యావసర సరుకులను నేరుగా ఇంటికే పంపే విధంగా […]
దిశ, మేడ్చల్: మల్కాజ్‌గిరి పరిధిలోని షఫీ నగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. షఫీ నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఉండడం వల్ల కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించామనీ, ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ జోన్‌లోని ప్రజలకు మందులు, నిత్యావసర సరుకులను నేరుగా ఇంటికే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాలంటీర్లందరూ గ్లౌజులు, మాస్కులు ధరించాలనీ, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడూ హైడ్రోక్లోరైట్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, జాన్ శాంసన్, స్థానిక ఆర్డీవో మల్లయ్య, డిప్యూటీ కమిషనర్ దశరథ్, తహసీల్దార్ గీత, వైద్యాధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Tags: shafi nagar, malkajgiri, containment zone, coronavirus, collector venkateshwarlu